Mahabubnagar: పోచమ్మ ఆలయ ప్రాంగణంలో మల్టీపర్పస్ షెడ్ ప్రారంభం

Mahabubnagar: మహబూబ్‌నగర్ సద్దలగుండు రాజేంద్రనగర్ పోచమ్మ ఆలయంలో రూ.10 లక్షల ముడా నిధులతో మల్టీపర్పస్ షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 21 Nov 2026 4:24 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: పోచమ్మ ఆలయ ప్రాంగణంలో మల్టీపర్పస్ షెడ్ ప్రారంభం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లోని సద్దలగుండు రాజేంద్రనగర్‌లో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ముడా నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ షెడ్‌ను ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ షెడ్‌ను నిర్మించినట్లు తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాన్ని కల్పించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ షెడ్ ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాన్ని కాపాడే గ్రామదేవత పోచమ్మ తల్లి అని, ఆ తల్లి మనందరిపై చల్లని చూపు ప్రసరించాలని ఆకాంక్షించారు.

అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.