Devarkadra: దేవరకద్ర అభివృద్ధి పనులకు భూ కేటాయింపులు చేయాలి

Devarkadra: మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి దేవరకద్రలో డిగ్రీ కాలೇజీ, స్టేడియం భూ కేటాయింపులపై చర్చించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 12 Nov 2026 3:50 PM IST
Devarkadra
X

Devarkadra: దేవరకద్ర అభివృద్ధి పనులకు భూ కేటాయింపులు చేయాలి

దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ తో సమావేశమై దేవరకద్ర నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

ఈ సందర్భంగా దేవరకద్ర పట్టణంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని, దేవరకద్ర లో స్టేడియం నిర్మాణానికి అదనంగా 3 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ ని కోరారు.

అలాగే చిన్నచింతకుంట జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించి, భూత్పూర్ మండలాన్ని కరువు మండలం ప్రకటించాలని కోరారు.

అదేవిధంగా ఎల్‌నినో నేపథ్యంలో రాబోయే రోజుల్లో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట్ల తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA