Mahabubnagar: ఛత్రపతి శివాజీ గణేష్ మండపంలో మాజీ సర్పంచ్ స్వప్న పూజలు!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్లలో ఛత్రపతి శివాజీ గణనాథునికి మాజీ సర్పంచ్ స్వప్న కిషన్‌రావు దంపతుల ప్రత్యేక పూజలు, భారీ అన్నదానం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.

GOKARANNA,  GADWAL
Published on: 19 Sept 2026 10:35 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ఛత్రపతి శివాజీ గణేష్ మండపంలో మాజీ సర్పంచ్ స్వప్న పూజలు!

Mahabubnagar: కౌకుంట్ల మండల కేంద్రంలోని యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గణేష్‌ మండపంలో ప్రతిష్ఠించిన గణనాథునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం కౌకుంట్ల మాజీ సర్పంచ్‌ స్వప్న కిషన్‌రావు దంపతులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. తదనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ

కార్యక్రమంలో కౌకుంట్ల సర్పంచ్‌ నరేష్‌కుమార్‌, ఎంపీడీవో శివప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న, ఈవో శివకుమార్, ఆంజనేయులు, రాజు, చత్రపతి శివాజీ గణేష్ యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. మండపం పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL