Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో అయ్యప్ప నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని సందర్శించిన విప్
Mahabubnagar: మహబూబ్‌నగర్ న్యూ ప్రేమ్‌నగర్‌లో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో అయ్యప్ప నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని సందర్శించిన విప్
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ లోని న్యూ ప్రేమ్‌నగర్‌లో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల కాలం పాటు ఎంతో నిష్ఠతో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించేందుకు నిర్మించిన ఈ క్షేత్రంలో తనను భాగస్వామిని చేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు. ఇది భగవంతుడు తనకు కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
కార్తీక మాసంలో దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు ఈ నిత్య అన్నప్రసాద క్షేత్రం వలన మేలు జరుగుతుందని అన్నారు. అన్నప్రసాద క్షేత్రానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఈ క్షేత్రం ద్వారా దీక్షలో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ నిరంతరం అన్నప్రసాదం అందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు నారాయణ గురుస్వామి మాట్లాడుతూ, అయ్యప్ప అన్నప్రసాద క్షేత్రం నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి* కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షేత్రంలో నిత్యం సుమారు 500 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వంటగది (కిచెన్), మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.




