Devarkadra: అడివి అజిలాపూర్, పేరూర్ లిఫ్టుల పనులపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష!

Devarkadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడివి అజిలాపూర్, పేరూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 28 Nov 2026 11:51 AM IST
Devarkadra
X

Devarkadra: అడివి అజిలాపూర్, పేరూర్ లిఫ్టుల పనులపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష!

దేవరకద్ర: దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడివి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అధికారులు స్పందిస్తూ.. లిఫ్ట్ కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని, డ్రాయింగ్స్ త్వరలో పూర్తవుతాయని వారం పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అనంతరం పేరూరు లిఫ్ట్ కు సంబంధించి స్థానిక నాయకులు, ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జియంఆర్. ఈ సందర్భంగా లిఫ్ట్ కు సంబంధించిన డ్రాయింగ్స్‌ అప్రూవల్స్ పక్రియ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA