Devarkadra: పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే జియంఆర్!

Devarkadra: కౌకుంట్ల మండలం అప్పంపల్లి పీఏసీఎస్ నూతన చైర్మన్ ఎస్. వెంకటేష్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 24 Nov 2026 1:01 PM IST
Devarkadra
X

Devarkadra: పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే జియంఆర్!

దేవరకద్ర: రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుందని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అవసరమైన యంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందిస్తూ రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి రైతుకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, మరియు ముఖ్యంగా సహకార సంఘాల నాయకులపై ఉందని అన్నారు. పార్టీకి కష్ట కాలంలో పనిచేసిన వారిని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని గుర్తించి నూతనంగా చైర్మన్లు గా, డైరెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి వరుస క్రమంలో పదవులు దక్కుతాయని అన్నారు. నూతనంగా నియమితులైన PACS చైర్మన్లు, డైరెక్టర్లు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే జియంఆర్ పిలుపునిచ్చారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులను కేవలం హోదాలుగా భావించకుండా రైతులకు సేవ చేసే బాధ్యతగా భావించాలని అన్నారు. అలాగే రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని, ప్రభుత్వం అందించే వ్యవసాయ సబ్సిడీలు అర్హులైన రైతులందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ ఇస్తున్నామని, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేశామని తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని, బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే జియంఆర్ గారు.

అలాగే కోయిల్ సాగర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అసత్య ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ 30-10-2017 నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే హన్వాడ, కోయిలకొండ, ధన్వాడ కోస్గి తదితర మండలాలకు డ్రింకింగ్ వాటర్ వెళ్తుందని, మేమేమీ కొత్తగా జీవో తీసుకు రాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తదనంతరం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జియంఆర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA