Devarakadra: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చైర్‌పర్సన్ దమయంతి!

Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆదేశాలతో చైర్‌పర్సన్ కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు 100 నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 29 Oct 2026 9:33 PM IST
Devarakadra
X

Devarakadra: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చైర్‌పర్సన్ దమయంతి!

దేవరకద్ర: స్థానిక శాసనసభ్యులు జీ.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్ రాధా కొండల్ తో కలిసి సుమారు 100 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆది హనుమంత్ రెడ్డి, ఉమ్మి గారి వెంకటేష్, శ్రీనివాసులు, చెన్నప్ప, జి పి ఓ రాజు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA