Devarakadra: పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సర్పంచ్ చినమ్మ!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో లబ్ధిదారులకు 740 స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ దాసరి చినమ్మ పంపిణీ చేసి పాఠశాలను సందర్శించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 29 Oct 2026 9:11 PM IST
Devarakadra
X

Devarakadra: పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సర్పంచ్ చినమ్మ!

దేవరకద్ర: దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ దాసరి చినమ్మ ఉషనప్ప ఆధ్వర్యంలో గ్రామానికి మంజూరైన 740 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి (GPO), వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలియజేసిన సర్పంచ్. అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుండటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే జీఎంఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సర్పంచ్

అనంతరం సర్పంచ్ దాసరి చినమ్మ ఉషనప్ప, వార్డు సభ్యులతో కలిసి గూరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)ను సందర్శించారు. అలాగే యూనిఫామ్ ధరించకుండా వచ్చిన విద్యార్థులను, ప్రతిరోజూ పాఠశాలకు ప్రభుత్వ యూనిఫామ్స్, బూట్లు ధరించి రావాలని సూచించడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ మంచిగా చదువుకొని, మంచి ఫలితాలు సాధించి మన గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA