Mahabubnagar: శ్రీనివాస్ గౌడ్ గెలవడం కలనే: డిప్యూటీ మేయర్ సురేందర్!
Mahabubnagar: మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మళ్లీ గెలవడం కలేనని, గతంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
Mahabubnagar: శ్రీనివాస్ గౌడ్ గెలవడం కలనే: డిప్యూటీ మేయర్ సురేందర్!
మహబూబ్ నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో గెలవడం అనేది ఓ కలనే అని, తనతో ఉన్న ప్రతీ ఒక్కరిని అనగాడొక్కాడనీ, అధికార ఆహాంకారంతో వ్యవహరించిన శ్రీనివాస్ గౌడ్ కు పాలమూరు ప్రజలు తగిన బుద్ది చెప్పారనీ మహబూబ్ నగర్ డిప్యుటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు.
ఆయనకు మళ్ళీ అధికారం కట్టబెడితే అంతు చూడాలి అనే ధోరణిలోనే నీ ఆయన తీరు కనిపిస్తుందనీ సురేందర్ రెడ్ది విమర్శించారు.గతం లో పాలమూరు లో స్వేచ్చ గా తిరగలేని పరిస్థితి ఉండేదిలని, ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛ గ ఉన్నారని ఆయన అన్నారు.
మాన్యంకొండ రోప్ వే కు ఫైనాన్స్ క్లియరెన్స్ లేదనీ, పట్టణ నడిబొడ్డున ఉండాల్సిన కలెక్టరేట్ ను నీ ఫామ్ హౌస్ ముందు కు తీసుకెళ్ళాడని, మెడికల్ కళాశాల కూడా యెన్నం శ్రీనివాస్ రెడ్ది హయాంలో నే బీజం పడిందనీ సురేందర్ రెడ్ది ఆరోపించారు.




