Mahabubnagar: భూత్పూర్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి భేటీ.. పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 11 Oct 2026 9:13 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: భూత్పూర్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి భేటీ.. పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి!

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు,పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.

సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీల పనితీరు నాయకులు, కార్యకర్తలకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం భవిష్యత్తులో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాల కార్యాచరణ

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి – ఏపి మిథున్ రెడ్డి గారు

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ఓటరు నమోదు ప్రక్రియ కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని, గ్రామాలు, మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, పార్టీ నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జాహిర్ అక్తర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు లింగం నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్, ఎన్.పి. వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు తిరుపతి, జిల్లా మత్స్య పారిశ్రామిక విభాగం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు అనుపాటి శేఖర్, డాక్టర్స్ సెల్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, భూత్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీతో పాటు డీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad