Mahabubnagar: మహబూబ్‌నగర్ దక్ష స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
Mahabubnagar: మహబూబ్‌నగర్ 49వ డివిజన్‌లోని దక్ష స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
Mahabubnagar: మహబూబ్‌నగర్ దక్ష స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ నగరం 49వ డివిజన్ దక్ష స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు వేడుకలను ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం శ్రీ ఆంజనేయులు గారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొన్న ఆనంద్ కుమార్ గౌడ్ గారు, ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన డివిజన్‌లో ఇంత మంచి పాఠశాలను ఏర్పాటు చేసి, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను అందించడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పాఠశాల దినదినాభివృద్ధి సాధించాలని, విద్యార్థులు విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ ఆంజనేయులు గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ బతుకమ్మ నవరాత్రులను మహిళలు, చిన్నారులు, పాఠశాల సిబ్బంది అందరూ ఆనందోత్సాహాలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకున్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి వేడుకలు చిన్నారుల్లో మన సంస్కృతి పట్ల అవగాహనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.




