Devarkadra: కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు!

Devarkadra: దేవరకద్రలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 9 Sept 2026 2:12 PM IST
Devarkadra
X

Devarkadra: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పోలీసుల ఫిర్యాదు

Devarkadra: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ జాతిపిత కెసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ దేవరకద్ర పోలీస్స్టేషన్లో కౌకుంట్ల బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చందు గౌడ్ నాయకులు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ సాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరికాదని, పాలమూరు జిల్లా పరువు తీసారని ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు వాపోయారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఈ రోజు

బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని ఇష్టారీతిన మాట్లాడడం సబబు కాదని, ఇప్పటికే వెయ్యి రోజులు దాటిన మీ పాలన మరో 800 రోజులలో ముగుస్తుందని రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌకుంట్ల గ్రామ అధ్యక్షుడు శివకుమార్, తిరుమలాపూర్, ముచ్చింతల, పుట్టపల్లి గ్రామ అధ్యక్షులు భాస్కర్, మార్కరాజు, బీచుపల్లి, కౌకుంట్ల మండల వైస్ ప్రెసిడెంట్ విజయ్, జనరల్ సెక్రెటరీ కురువ రవి, యువ నాయకులు అమీర్ తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story