Station Ghanpur: తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుపై కృతజ్ఞతలు
Station Ghanpur: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Station Ghanpur: తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుపై కృతజ్ఞతలు
స్టేషన్ ఘనపూర్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలను 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హర్షం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను కేటాయించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.... ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలను సుమారు ₹10 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అభివృద్ధి చేయడంతో పాటు ఈ పబ్లిక్ స్కూల్ ద్వారా ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన ఉచిత, నాణ్యమైన విద్యను అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో చదువుకునే అవకాశం లభిస్తుందని, ఇది నియోజకవర్గ విద్యా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు అని కొనియాడారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై ఉన్న ప్రేమతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయించడం పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




