Maganoor: మాగనూరు విద్యుత్ శాఖలో 'బినామీల' వసూళ్లు!

Maganoor: నారాయణపేట విద్యుత్ శాఖలో ఉద్యోగులు విధులకు రాకుండా బినామీలతో పనులు చేయిస్తూ జీతాలు తీసుకుంటున్నారని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతుల ఆరోపణ.

B. NARENDER, MAKTHAL
Published on: 23 Oct 2026 12:28 PM IST
Maganoor
X

Maganoor: మాగనూరు విద్యుత్ శాఖలో 'బినామీల' వసూళ్లు!

Maganoor: మాగనూరు మండలం లో విద్యుత్ సంస్థ లో కొందరు ఉద్యోగులు వారి ఉద్యోగం రాకుండా నెలవారీ జీతాలు లక్షలలో ఎత్తుతు భీనామీ లతో కాంట్రాక్టు పద్దతి లో ఇతరులతో పనులను చేయిస్తున్నారు.విద్యుత్ సంస్థ లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీలు ఉండడం సహజం.

కానీ మాగనూరు మండలం కు వచ్చిన ఇద్దరు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ లు గత కొంత కాలం నుండి తమ విధులకు రాకుండా ఇతరులతో పని చేపిస్తూ నేల నేల జీతాలు తీసుకుంటున్నారు.

ఈ ఉద్యోగులపై చర్యలు తీసుకొనేందుకు పై అధికారులు చర్యలు చేపడితే జిల్లా నాయకులు అని చెప్పి తప్పించు కుంటున్నారని విద్యుత్ సహచర సిబ్బంది వాపోతున్నారు.అందుకే పై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని తెలిపారు. వీరు స్థానం లో

కాట్రాక్ట్ పద్దతి లో పనిచేసే విద్యుత్ భీనామీ ఉద్యోగి తమ ఇస్టానుసారం వసూళ్ల పర్వం చేస్తున్నట్టు మాగనూరు మండల రైతులు, ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

రైతులు ముఖ్యంగా తమ పంట పొలాల కోసం కరెంటు సమస్యల పైన ఫోన్ చేస్తే సరైన సమాధానం ఇవ్వక వేధిస్తున్నారని రైతులు వాపోయారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు విధులకు రాని విద్యుత్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాకోవాలని మాగనూరు మండలంలోని రైతులు, ప్రజలు కోరుతున్నారు

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL