Maganoor: మాగనూరులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి: 4 టిప్పర్ వాహనాలు సీజ్

Maganoor: మాగనూరు మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక టిప్పర్లను ఎస్సై మహేందర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 9 Nov 2026 6:34 PM IST
Maganoor
X

Maganoor: మాగనూరులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి: 4 టిప్పర్ వాహనాలు సీజ్

మాగనూరు: మాగనూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎస్సై మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు తెల్లవారుజామున జరిపిన తనిఖీలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 4 టిప్పర్ ల వాహనాలు పట్టుకున్నారు.

ఇందులో వడ్యాట్ గ్రామ శివార్లలో రెండు టిప్పర్ వాహనాలు, వడ్వాట్ నుండి చందాపూర్ వెళ్లే దారిలో మరో రెండు టిప్పర్ వాహనాలు పోలీసులకు దొరికాయి. ఇసుక రవాణాకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆ నాలుగు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని మాగనూరు పోలీసులు హెచ్చరించారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL