Mahabubnagar: ఆభరణాల ఊరేగింపులో కోలాటం వేసిన మంత్రి, ఎమ్మెల్యే

Mahabubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆభరణాల ఊరేగింపులో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కోలాటం వేసి భక్తులను ఉత్సాహపరిచారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 14 Nov 2026 7:36 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ఆభరణాల ఊరేగింపులో కోలాటం వేసిన మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్ నగర్: శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి ఆభరణాలు (అలంకారం) ఆత్మకూరు పట్టణంలోని ఎస్.బి.ఐ బ్యాంక్ నుండి కురుమూర్తి స్వామి దేవాలయానికి బ్యాండ్ మేళాలతో, భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి.

స్వామి వారి నగలకు బ్యాంక్ లో మరియు పరమేశ్వరుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో మరియు ఊరేగింపులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి తో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి , మంత్రి, ఎమ్మెల్యేలు కోలాటం వేసి భక్తులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA