Kothakota: శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు!
Kothakota: కొత్తకోట శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
Kothakota: శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు!
Kothakota: పట్టణంలోని కొలువైన శ్రీ వాసవీ కన్యపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కోసం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శత్రుబాధల నివారణ కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవి కృపాకటాక్షాలు పొందేందుకు ఆలయ ప్రాంగణంలో డోలాగౌరీ వ్రతాన్ని నిర్వహించనున్నారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.




