Devarkadra: దేవరకద్రలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు!
Devarkadra: దేవరకద్రలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు మరియు తెలంగాణ విమోచన దినోత్సవం. జెండా ఆవిష్కరించి, రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు కొండా ప్రశాంత్ రెడ్డి.
Devarkadra: దేవరకద్రలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు!
Devarkadra: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి శ్రేణులు తో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కొండా ప్రశాంత్ రెడ్డి అలాగే తెలంగాణ విమోచన దినం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా సేవలు అందించడం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో ఆశీర్వాద దీపం వెలిగించి ప్రధానమంత్రి జన్మదినాన్ని జరుపుకోవాలని కోరారు.
నాటి నిజాం నిరంకుశ పాలను అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదురించి ఆపరేషన్ పోలో చేపట్టి తెలంగాణకు విమోచనం కల్పించారని తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండలాధ్యక్షుడు కృష్ణంరాజు ,రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యజ్ఞభూపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి,, రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు దేవన్న సాగర్ , దేవరకద్ర నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఉమా రాజు, బీజేపీ శేఖర్,రాచాల రాజు, విద్యాసాగర్, శ్రీశైలం చారి, శ్రీను,కొండా వెంకటేశ్వర్ రెడ్డి, కొండ నాగిరెడ్డి, టైల్స్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, అరవింద్,తిమ్మన్న, హోటల్ ఆంజనేయులు, అంజి, నరేష్, గణేష్, వెంకటేష్, నరేందర్, వాకిటి ఆంజనేయులు, రాజుమూరి, నట్టలి కృష్ణయ్య, అప్పి, అనిల్ కుమార్,నవీన్, అమరేందర్ రెడ్డి, శివకుమార్, ముఖ్య నాయకులు గ్రామం మండల జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.




