Kollapur: మరికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం!

Kollapur: కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు.

VENKATESWARA CHARY, KOLLAPUR
Published on: 26 Nov 2026 10:25 AM IST
Kollapur
X

Kollapur: మరికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం!

కొల్లాపూర్: పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కాకం రాజేశ్వరిశ్రీరాములు, చెన్నమ్మశివరాజు, కాకం లక్ష్మి అశోక్, ఎల్లమ్మ కిష్టయ్య ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మరియు పెద్దకొత్తపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి సత్యం పాల్గొని గ్రామ ఉపసర్పంచ్ బాలమ్మ వెంకటస్వామి చేత రిబ్బన్ కటింగ్ చూపించడం జరిగింది.

అలాగే కుటుంబ సభ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమామ్ గౌడ్, గ్రామ మత్సకార సంఘం అధ్యక్షులు పుట్ట రమేష్, మారోజు నరేంద్ర చారి, కాకం అశోక్, బొల్లె నరసింహ, ఎండీ అషు తదితర నాయకులు పాల్గొన్నారు.

VENKATESWARA CHARY, KOLLAPUR

VENKATESWARA CHARY, KOLLAPUR