Kollapur: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాపై అవగాహన కార్యక్రమం
Kollapur: కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాపై అవగాహన; అర్హులు నమోదు చేసుకోవాలని పిలుపు.
Kollapur: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాపై అవగాహన కార్యక్రమం
కొల్లాపూర్: నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం, దేవుని తిరుమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా భీమా పరిహారం అందుతుందని నాయకులు వివరించారు.
కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి, భీమా సౌకర్యాన్ని పొందాలని, అర్హులైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు : వన్నోజు సత్యం, గ్రామ సర్పంచ్ పిల్లి పల్లవి, గ్రామ సెక్రటరీ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొల్లె విష్ణు, వార్డు నెంబర్లు కొనమోని ఎల్లస్వామి, మిద్దె చంద్రయ్య, బాగి చంద్ర శేఖర్, కేశంపేట మణెమ్మ ,కేశంపేట గౌతమి, పిల్లీ అరుణ,పిల్లి నాగ్గరాజ్
గ్రామ నాయకులు, బొల్లె పెద్ద నిరంజన్, బొల్లె ఉగాది, పిల్లి శేఖర్, గుజ్జారి మార్కండేయ ,మరికంటి మైబూస్, శివుడు, బిజినపల్లి రాములు, బిజినపల్లి వెంకటయ్య, మిద్దె భగవంతు, మిద్దె బుడ్డయ్య, బిజినపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




