Kodangal: కొడంగల్ రైతు మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు కార్యదర్శి సురేంద్ర మోహన్
Kodangal: హకీంపేటలో జరగనున్న కొడంగల్ రైతు మేళా ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ సమీక్ష. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు.
Kodangal: కొడంగల్ రైతు మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు కార్యదర్శి సురేంద్ర మోహన్
కొడంగల్: కొడంగల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, మాట్లాడుతూ...ఈ నెల 7 నుండి 9 వరకు కొండంగల్ లోని జరిగే రైతు మేళాకు పెద్ద సంఖ్యలో రైతులు,అన్నదాతలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు మేళా ప్రాధాన్యతను వివరించి వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు.
రైతు మేళా సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం,ప్రధాన వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతు మేళాకు హాజరయ్యే రైతులు, చేరుకోవడం నుంచి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా,ఇతర సదుపాయాలను సమన్వయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం భోజనం, తాగునీరు,విశ్రాంతి తదితర అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రదర్శన స్టాళ్లను ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా రూపొందించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, సూక్ష్మ సేద్యం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.కొడంగల్ రైతు మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి..రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్
కొడంగల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, మాట్లాడుతూ...ఈ నెల 7 నుండి 9 వరకు కొండంగల్ లోని జరిగే రైతు మేళాకు పెద్ద సంఖ్యలో రైతులు,అన్నదాతలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు మేళా ప్రాధాన్యతను వివరించి వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు.
రైతు మేళా సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం,ప్రధాన వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతు మేళాకు హాజరయ్యే రైతులు, చేరుకోవడం నుంచి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా,ఇతర సదుపాయాలను సమన్వయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం భోజనం, తాగునీరు,విశ్రాంతి తదితర అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రదర్శన స్టాళ్లను ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా రూపొందించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, సూక్ష్మ సేద్యం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.




