Kaukuntla: కౌకుంట్ల ZPHS పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Kaukuntla: కౌకుంట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల 2001-2002 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మహబూబ్నగర్ అన్నపూర్ణ గార్డెన్లో ఘనంగా జరిగింది.
Kaukuntla: కౌకుంట్ల ZPHS పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కౌకుంట్ల: కౌకుంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కౌకుంట్ల 2001-2002 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. సుమారు 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకోవడంతో ప్రాంగణం ఆనందోత్సవాలతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ముందుగా పూర్వ విద్యార్థులు తమ గురువులకు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ముందుకు సాగేందుకు మార్గ నిర్దేశం చేసిన గురువుల సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు అయిన జగదీశ్వరయ్య, రామ్ రెడ్డి, రామాచారి, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, భాగ్య రేఖ, విజయ్ కుమార్, అబ్దుల్ గని, వహీద్, ఉమాపతి రెడ్డి, రాములు, రామా శర్మ,ముస్తఫా, లను పూర్వ విద్యార్థులు శాలువతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
తమకు విద్యాబోధన చేసిన గురువులకు ఇన్నేళ్లు తర్వాత కలుసుకోవడం పూర్వ విద్యార్థుల్లో ఆనందం నింపింది. అనంతరం దివంగత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన నిర్వాహకులకు కూడా శాలువతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. చిన్ననాటి స్నేహాలు, తరగతి గది అల్లర్లు ఆటపాటలు గురువుల మందలింపులు వారు నేర్పిన జీవిత పాఠాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం 25 ఏళ్ల స్నేహ బంధానికి ప్రతీకగా కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




