Kaukuntla: అరవింద్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం

Kaukuntla: కౌకుంట్ల మండలం పేరూరులో కాంగ్రెస్ నాయకులు కొత్త అరవింద్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన, ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 15 Nov 2026 9:48 PM IST
Kaukuntla
X

Kaukuntla: అరవింద్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం

కౌకుంట్ల: కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొత్త అరవింద్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు కొత్త అరవింద్ కుమార్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా రక్తదానం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA