Devarakadra: కేసీఆర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం!
Devarakadra: కళ్యాణ లక్ష్మికి 12 ఏళ్లు వెంకటాయపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహిళలు కాంగ్రెస్ హామీలపై తీవ్ర విమర్శలు.
Devarakadra: కేసీఆర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం!
దేవరకద్ర: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం నేటితో పన్నెండు ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. మొదటగా వెంకటాయపల్లి గ్రామంలో నూతనంగా ఆవిష్కరించిన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఈ పథకం మేనమామ లాగా అండగా నిలిచిందన్నారు.ఆడబిడ్డల పెండ్లి కోసం ఇబ్బంది పడుతున్న లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో కళ్యాణలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.దేవరకద్ర నియోజకవర్గంలోనే పదివేల కుటుంబాలు లబ్ధి పొందాయని గుర్తు చేశారు.
దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరుపున కేసీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి పథకం చెక్ తో పాటు,తులం బంగారం అదనంగా ఇస్తామని మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సక్కెరి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ భారతమ్మ, చంద్రశేఖర్, ఏసిఎస్ చైర్మన్ లు నరేందర్ రెడ్డి, బూనేటి రవీందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, జెట్టి నరసింహారెడ్డి, సాయి మిత్ర బాలరాజ్, ఉష్కిల్ల వెంకట రాములు, చల్మారెడ్డి, కేబీఆర్ గౌడ్, మధు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




