Veldanda: వెల్దండలో మామిడి తోటలో పేకాట.. ఆరుగురు వ్యక్తుల అరెస్ట్!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రా గేట్ సమీపంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రెండు స్విఫ్ట్ కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Nov 2026 8:01 AM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో మామిడి తోటలో పేకాట.. ఆరుగురు వ్యక్తుల అరెస్ట్!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కొట్రా గేట్ సమీపంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రెండు స్విఫ్ట్ కార్లు, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.6,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తిమ్మినోనిపల్లి గ్రామ శివారులోని కొట్ర చౌరస్తా సమీపంలో తిరుపతి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా, ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించారు.

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కుమ్మరి దశరథ్ లేమూరు గ్రామం, కందుకూరు మండలం, బస్సు చిన్నారెడ్డి తుమ్మలూరు గ్రామం, మహేశ్వరం మండలం, బొజ్జ విద్యాసాగర్ రెడ్డి తుమ్మలూరు గ్రామం, మహేశ్వరం మండలం, జాపాల బాబురావు తుక్కుగూడ, కట్టగల మహేందర్ తుమ్మలూరు.

ఇరుగమల్ల నరసింహ రాచలూరు గ్రామం, కందుకూరు మండలం గా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు స్విఫ్ట్ కార్లు, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.6,600 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY