Veldanda: కల్వకుర్తి, వెల్దండ అభివృద్ధికి రూ.5.60 కోట్ల నిధులతో కొత్త ఊపు!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.5.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఫైర్ స్టేషన్ ప్రారంభించారు.
Veldanda: కల్వకుర్తి, వెల్దండ అభివృద్ధికి రూ.5.60 కోట్ల నిధులతో కొత్త ఊపు!
వెలుదండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. సోమవారం కల్వకుర్తి పట్టణంతో పాటు వెల్దండ మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యానగర్, తిలక్‌నగర్ ప్రాంతాల్లో నివాస గృహాల మీదుగా వెళ్తున్న 33 కేవీ సిర్సనగండ్ల ఫీడర్ విద్యుత్ లైన్‌ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మార్చేందుకు చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు విద్యుత్ లైన్ల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి.
తదుపరి మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంతో పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్ శ్రీపురం హరీశ్వర్ రెడ్డి, నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా వెల్దండ మండలంలో నూతనంగా ఎన్నికైన PACS చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించారు. అనంతరం వెల్దండ మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో పర్యటించిన ఎమ్మెల్యే దాదాపు రూ.5.60 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజా పాలన ప్రభుత్వంలో సహకార సంఘాలకు ప్రతినిధులుగా ఎన్నికైన నూతన పాలకవర్గం రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 5 సహకార సంఘాలకు చైర్మన్ వైస్ చైర్మన్ లు గా సామాజిక న్యాయంతోనే ,భర్తీ చేశామన్నారు. సొసైటీ పరిధిలో రైతులకు కావాల్సిన ప్రతి అంశంపై దృష్టి సారించాలన్నారు..ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ మెంబర్, ఠాకూర్ బాలాసింగ్, మాజీ జెడ్పిటిసి, అశోక్ రెడ్డి,
మాజీ సర్పంచులు ఆనంద్ కుమార్ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గోలి సుదర్శన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్, రమాకాంత్ రెడ్డి, సీఈవో వెంకటరెడ్డి, డైరెక్టర్లు, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.




