Kalwakurthy: కల్వకుర్తి వాసవి గుడిలో భక్తజనసంద్రం
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల 3వ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమివ్వగా, 3 వేల మందికి అన్నదానం చేశారు.
Kalwakurthy: కల్వకుర్తి వాసవి గుడిలో భక్తజనసంద్రం
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తజన సంద్రంతో నిండిపోతున్నాయి. ఉదయం నుండే భక్తులు దేవాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలలో భాగస్వామ్యం అవుతున్నారు.
మంగళవారం మూడవరోజు వాసవి మాత గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా కుంకుమార్చనలు, గీత, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించే ఆలయానికి విచ్చేసిన భక్తులకు తంబోలా గేమ్ నిర్వహించి బహుమతులను అందించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చే మహిళలకు లక్కీ డిప్ ద్వారా చీరను బహుమతిగా అందించారు.
దాదాపు 3,000 మందికి అన్నదానం చేసినట్లు ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు వెల్లడించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దాండియా , నాగరాజు స్వామి ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ వసతి ఏర్పాట్లు చేసినట్లు జూలూరు రమేష్ బాబు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ విజేతలకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి గుబ్బ కిషన్, వాస మనీష్, బాదం రాఘవేందర్,పట్టణ సంఘం అధ్యక్షుడు వాస శేఖర్, చిగుళ్లపల్లి శ్రీధర్, గుగ్గిళ్ళ శంకర్, దాచేపల్లి మనోహర్, పోలా సురేందర్, మహిళా సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక, కల్మిచర్ల స్వాతి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు ఆవోప, వాసవి క్లబ్ సభ్యులు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




