Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తక్షణ ఆర్థిక సహాయం
Kalwakurthy: కల్వకుర్తి మున్సిపాలిటీ తిమ్మారాశి పల్లిలో మృతి చెందిన చిత్తరి వెంకటయ్య కుటుంబాన్ని ఉప్పల వెంకటేష్ పరామర్శించి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తక్షణ ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మారాశి పల్లి 5వ వార్డుకు చెందిన చిత్తరి వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తుప్పల సిరియల్, శ్రీరామ్, సుధకంటి శ్రీను, సుధకంటి యాదయ్య, కనికళ్ల కుమార్, పానగంటి పరశురాములు, ముచ్చింత మాధవులు, సాటు యాదయ్య, జమ్ములు, చిత్తరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




