Kalwakurthy: కల్వకుర్తిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే

Kalwakurthy: కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ప్రముఖ నేతలు పాల్గొని పూజలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Oct 2026 9:47 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక, భక్తి భవానికి చిహ్నాలు అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే సి .లక్ష్మారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనముల కృష్ణారెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి లు అన్నారు.

శివ శరన్నవరాత్రి ఉత్సవాల లో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో చండీ హోమం సామూహిక కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఈ సందర్భంగా అతిథులుగా వచ్చిన వారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవి ఉన్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనం ఇస్తుందన్నారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు కోరారు. 37 సంవత్సరాలుగా కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు ప్రతి ఏటా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయని కొనియాడారు.

ఆలయానికి విచ్చేసే భక్తులకు అల్పాహారం, భోజనం, రాత్రికి అల్పాహారం వేల సంఖ్యలో అందించడం గొప్ప విషయం అని వారన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, యనమల కృష్ణారెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి 108 ఏ గవర్నర్ కల్మిచర్ల రమేష్, ఉత్సవ కమిటీ కార్యదర్శులు నారాయణరాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బ కిషన్, వాసమనిష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు,వాసా శేఖర్, చిగుల్లపల్లి శ్రీధర్, ముత్యాలు, సురేందర్, గుగ్గిళ్ళ శంకర్, పాపిశెట్టి శ్రీనివాస్ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY