Kalwakurthy: రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

Kalwakurthy: కల్వకుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వేపూర్ గ్రామానికి చెందిన శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. రూ.8 వేల ఆర్థిక సాయం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Oct 2026 4:15 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వేపూర్ గ్రామానికి చెందిన శంకర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా కల్వకుర్తి పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఈ విషయం వేపూర్ గ్రామానికి చెందిన కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ (గోవర్ధన్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించారు.

హైదరాబాద్ లోని జీవన్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న శంకర్‌ను, ఆయన కుమార్తె భూమికను, కుమారుడిని పరామర్శించారు.

ప్రమాదం కారణంగా శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి రూ. 8,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, అనిల్ కుమార్(హైజాక్ ), గోపి తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY