Kalwakurthy: బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000 సాయం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Nov 2026 4:56 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఏసు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారు. ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.

ఈ మేరకు కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్‌ల ద్వారా మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో అంజయ్య గౌడ్, గుర్రం బచ్చయ్య, గుండూర్ పరశురాములు, మాజీ సర్పంచ్ బాలస్వామి, శ్రీకాంత్, బాల్ లింగం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY