Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
Kalwakurthy: కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ మైనార్టీ నాయకుడు ఎండి అమీనొద్దీన్ మృతి పట్ల తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సాయం చేశారు.
Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి మండలం: తాండ్ర గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు *ఎండి. అమీనొద్దిన్ * అనారోగ్యంతో మరణించడం జరిగింది.
ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకుల ద్వారా తెలుసున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 5000/- రూపాయలు మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అధైర్య పడొద్దు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మైబు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లయ్య, రమేష్, అనిల్ జంగయ్య, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




