Kalwakurthy: భక్తి భావంతో జీవనం సాగించాలి మాజీ ఎంపీ పోతుగంటి రాములు!

Kalwakurthy: కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల్లో మాజీ ఎంపీ పోతుగంటి రాములు పాల్గొని పూజలు చేశారు. 3 వేల మందికి అన్నదాన ప్రసాదం పంపిణీ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Oct 2026 10:00 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: భక్తి భావంతో జీవనం సాగించాలి మాజీ ఎంపీ పోతుగంటి రాములు!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రం సమాజంలోని ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలుగుతూ దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పోతుగంటి రాములు కోరారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పోతుగంటి రాములు మాట్లాడుతూ దైవచింతనతో జీవనం సాగించాలని, దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. మాజీ జెడ్పీటీసీ కల్వకుర్తి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ దైవచింతన మనసుకు ప్రశాంతతనిస్తుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఆకుతోట రాజశేఖర్, కార్యదర్శి ముష్టిపల్లి స్వామి, కొల్లాపూర్‌కు చెందిన 20 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ట్రస్టు చైర్మన్ జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ మాట్లాడుతూ అమ్మవారికి మణిద్వీప వర్ణన, కుమార్చన పూజలు నిర్వహించామని, సుమారు 3,000 మందికి భోజన ప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నారాయణరాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బ కిషన్, వాసా మనీష్, మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గంధం ప్రసాద్, పట్టణ మహాసభ అధ్యక్షుడు వాసా శేఖర్, చిగుళ్లపల్లె శ్రీధర్, గంప శీను, సంబు ముత్యాలు, అప్పాయిపల్లి శ్రీను, గుగ్గిల శంకర్, పాలుట్ల జంగయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు గోవింద మౌనిక, కల్మిచర్ల స్వాతి తదితరులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY