Kalwakurthy: శివాజీ చౌక్ వినాయక మండపంలో ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి పూజలు

Kalwakurthy: కల్వకుర్తి శివాజీ చౌక్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి. ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 7:21 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: శివాజీ చౌక్ వినాయక మండపంలో ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి పూజలు

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శివాజీ చౌక్‌ సమీపంలో వేపచెట్టు వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణనాథుడికి పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో పాటు భక్తులతో ఆయన ముచ్చటించారు. కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY