Kalwakurthy: మార్చాల గ్రామంలో 71 నూతన పింఛన్లు మంజూరు

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో 71 నూతన చేయూత పింఛన్లు మంజూరు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Nov 2026 5:41 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: మార్చాల గ్రామంలో 71 నూతన పింఛన్లు మంజూరు

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలోని అర్హులైన పేదలకు 71 నూతన చేయూత పింఛన్లు మంజూరు కావడంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్చాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడం పట్ల వారు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY