Pebberu: జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తాం!
Pebberu: జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాడుతామని పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జి. బాలవర్ధన్ తెలిపారు. అక్టోబర్ 2న నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
Pebberu: జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తాం!
Pebberu: జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తామని వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జి. బాలవర్ధన్ అన్నారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవం’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఐజేయూ పిలుపునిచ్చింది. ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా బుధవారం పెబ్బేరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జి. బాలవర్ధన్,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పరశురాం, TUWJ (IJU) నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పి. బాలరాజు, ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.
అక్టోబర్ 2న వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమానికి పెబ్బేరు ప్రెస్ క్లబ్ తరఫున యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం, నెలవారీ పారితోషకాల చెల్లింపు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు బెదిరింపుల నివారణ తదితర డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కిరణ్‌కుమార్ గౌడ్, ప్రచార కార్యదర్శిలు అతీఖ్ పాషా, రాజేష్ , కమిటీ సభ్యులు మన్నెం, రాంబాబు, నాగరాములు, తరుణ్, లక్ష్మీనారాయణ, రమేష్, విభూది కుమార్, భాస్కర్, ఎల్లస్వామి, చెంద్రాయుడు, కృష్ణ, రామకృష్ణ, బుచ్చన్న, ఎం. గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




