Narayanpet: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం!

Narayanpet: నారాయణపేట 7, 8 వార్డుల్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశాలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కౌన్సిలర్ సత్యమ్మ, ఎండీ సలీం ప్రారంభించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 23 Nov 2026 5:45 PM IST
Narayanpet
X

Narayanpet: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం!

నారాయణపేట: నారాయణపేట పట్టణం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిందని మున్సిపల్ కౌన్సిలర్ సత్యమ్మ, కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ సలీం లు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏడు మరియు ఎనిమిదవ వార్డులో ఎమ్మెల్యే డా. చిట్టెం. పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం. పర్ణిక రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి వాటి ప్రయోజనాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రహమాన్,సౌమ్య ఆర్పీ లు పుష్ప, జ్యోతి, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA