Makthal: వడ్వాట్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల అందజేత!

Makthal: మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం వడ్వాట్ గ్రామంలో 8 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ జి. రవీందర్.

B. NARENDER, MAKTHAL
Published on: 24 Oct 2026 2:01 PM IST
Makthal
X

Makthal: వడ్వాట్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల అందజేత!

Makthal: మక్తల్ నియోజకవర్గం మాగనురు మండలం వడ్వాట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్వహించిన ప్రొసీడింగ్ కాపీ వితరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ గారు . మరియు మండల అధ్యక్షులు శివరాం రెడ్డిగారు మరియు వడ్వాట్ గ్రామ సర్పంచ్ జి రవీందర్ గారు . మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో వడ్వాట్ లో (8 ) మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ లను అందజేశారు.

ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో గుడిసెలు లేని రాష్ట్రముగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వడ్వాట్ గ్రామ సర్పంచ్ రవీందర్ తెలియజేసారు.ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమంలో. గ్రామ ఉపసర్పంచ్ ఎస్ కళ్యాణి గారు, గ్రామ సెక్రెటరీ రవికుమార్ గారు, మరియు వార్డు మెంబర్స్ & మాజీ ఎంపిటిసి సుదర్శన్ గౌడ్ గారు,కాంగ్రెస్ నాయకులు,మరియు గ్రామ పెద్దలు గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL