Devarkadra: దేవరకద్రలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం!

Devarkadra: దేవరకద్రలో నాగుల చిట్టెమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ఘనంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమం!

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Updated on: 23 Oct 2026 3:03 PM IST
Devarkadra
X

Devarkadra: దేవరకద్రలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం!

Devarkadra: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధికి చెందిన నాగుల చిట్టెమ్మకు దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.


ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు ఆమె ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.


ఏ ఒక్క నిరుపేద కూడా గుడిసెల్లో జీవించకూడదనే ఉద్దేశంతో గుడిసెలు ఉన్న ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో దేవరకద్ర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్లు రామంజి, బాలరాజు, మున్సిపాలిటీ మేనేజర్ శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA