Makthal: మక్తల్‌లో భీమా కాలువ మట్టి అక్రమ తరలింపు పట్టించుకోని అధికారులు

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో భీమా కాలువ మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా భారత్‌మాల రహదారి పనులకు తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

B. NARENDER, MAKTHAL
Published on: 23 Oct 2026 8:30 AM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో భీమా కాలువ మట్టి అక్రమ తరలింపు పట్టించుకోని అధికారులు

Makthal: మక్తల్ మండలం లో బీమా కాలువ ఫేజ్ 2 దగ్గర ఉన్న కాలువ మట్టిని భారత్ మాల 167 హైవే రోడ్డు విస్తరణ కు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గుత్తేదారు తరలిస్తున్నారు. ప్రాజెక్టు లకు అవసరాలకు కోసం నిల్వ ఉంచిన మట్టిని తరలించాలి అంటే మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ అనుమతులు తప్పనిసారి.

కానీ మక్తల్ పట్టణం చివరి గుండా వెళుతున్న భారత్ మాల రోడ్డు పనులను గుత్తేదారు ప్రారంభించారు. భారత్ మాల దగ్గర లో ఉన్న భీమా కాలువ దగ్గర లో ఉండడం తో కాలువ మట్టిని ఎలాంటి అనుమతి తీసుకోకుండా మట్టిని తరలిస్తు ప్రభుత్వ ఖజానా కు గండి కొడుతున్నారు.

ఎవ్వరైనా ప్రజలు తమ అవసరాల కోసం మట్టి తరలిస్తే మైనింగ్ శాఖ వాళ్ళు, భీమా ప్రాజెక్టు అధికారులు వెంటనే కేసులు నమోదు చేయించేవారు. మరి ఇంతజరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా భీమా ప్రాజెక్టు, మైనింగ్ అధికారులు, స్పందించి అక్రమ మట్టి రవాణా ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL