Mahabubnagar: రాజమూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Mahabubnagar: దేవరకద్ర చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఆలయానికి అమావాస్య శనివారం వేళ భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అన్నదానం నిర్వహణ.
Mahabubnagar: రాజమూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం రోజు స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అర్చనలు,అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేష్ మాట్లాడుతూ.. అమావాస్య, శనివారం ఒకేరోజు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు.మరికల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మీ దంపతులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.




