Devarakadra: దేవరకద్ర ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉచిత ఆరోగ్య శిబిరం!

Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహణ. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సూచనలు అందించిన అధికారులు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Updated on: 5 Nov 2026 2:52 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్ర ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉచిత ఆరోగ్య శిబిరం!

Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ బాలుర వసతి గృహంలో గురువారం రోజు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ గురించి వివరించి అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో CHO ఆశోక్ కుమార్, హాస్టల్ వార్డెన్ తుర్యానంద్, సూపర్ వైజర్ రాంచందర్ జీ, ANM శంకరమ్మ ఆశా వర్కర్లు, హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA