Achampet: అచ్చంపేట 100 పడకల ఆస్పత్రిలో దారుణం.. వైరల్ అవుతున్న వీడియో!

Achampet: అచ్చంపేట ఆసుపత్రిలో వీల్ చైర్లు లేక వృద్ధురాలిని మనవడు మోసుకెళ్లిన వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ వైద్యం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 24 Oct 2026 5:47 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేట 100 పడకల ఆస్పత్రిలో దారుణం.. వైరల్ అవుతున్న వీడియో!

Achampet: పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందనడానికి అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

ఘటన వివరాలు:

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వర్ధం జంగమ్మ (సుమారు 70 ఏళ్లు)* కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితికి చేరుకుంది.

దీంతో ఆమె మనవడు ఆంజనేయులు గురువారం ఆమెను అచ్చంపేటలోని 100 పడకల ప్రభుత్వ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చాడు.

ఆటో దిగిన తర్వాత దవాఖాన మెయిన్ గేటు నుండి లోపల ఉన్న OPD వరకు తీసుకెళ్లడానికి వీల్ చైర్ (మూడు చక్రాల కుర్చీ) లేదా స్ట్రెచర్ కోసం చాలాసేపు ఎదురుచూశాడు. అక్కడ సిబ్బందిని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు.

యువకుడు వృద్ధురాలిని చంకలో ఎత్తుకుని హాస్పిటల్ కారిడార్ లో నడుస్తూ వెళ్తున్నాడు.

1. ఎంట్రన్స్ నుండి: హాస్పిటల్ ప్రధాన ద్వారం నుండి లోపలికి

2. వాటర్ ఫిల్టర్, కారిడార్ దాటి:* రోగులు కూర్చున్న బెంచీల మధ్య నుండి

3. YUWA CLINIC (యువ క్లినిక్) బోర్డు ఉన్న గది వరకు

4. చివరకు లోపల ఉన్న డాక్టర్ ఛాంబర్లోకి తీసుకెళ్లి టేబుల్ ముందు నిలబడటం వరకు - ఒక్కడే మోసుకెళ్లాడు.

సుమారు 150 మీటర్ల దూరం వృద్ధురాలిని మోస్తూ వెళ్తున్నా, దవాఖానలో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. అక్కడున్న తోటి రోగులు, వారి సహాయకులు చూస్తూ ఉండిపోయారు.

ప్రజల ఆగ్రహం:

వంద పడకల దవాఖానలో కనీసం 2-3 వీల్ చైర్లు కూడా అందుబాటులో లేకపోవడం ఏంటి? ఒకవేళ ఉన్నా వాటిని తాళం వేసి పెట్టారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అచ్చంపేట దవాఖానకు రోజూ 300 మందికి పైగా OPD కి వస్తుంటారు. వృద్ధులు, గర్భిణీలు, ప్రమాద బాధితులు ఎంతో మంది వీల్ చైర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టినా, లోపల సౌకర్యాలు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి" అని సింగారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) స్పందించి వెంటనే విచారణ జరిపి, అచ్చంపేట దవాఖానలో వీల్ చైర్లు, స్ట్రెచర్లు, సహాయకులను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA