Nagarkurnool: నంది వడ్డేమాన్‌లో వైభవంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు!
Nagarkurnool: నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు, పరమశివునికి రుద్రాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Nagarkurnool: నంది వడ్డేమాన్‌లో వైభవంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు!
Nagarkurnool: శ్రీ పరాభవ నామ సంవత్సరం కార్తిక మాసం శుక్ల పక్షం పంచమి,షష్టి తిథి పూర్వాషాఢ ఉత్తరాషాడ నక్షత్రము నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీశనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగాయి.
శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలునిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరు జన్మ రిత్యా,గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని అన్నారు. ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు,దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచేనిర్వహించారు.
అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.ఈకార్యక్రమం లో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ,కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి,పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు,మహిళలు పాల్గొన్నారు.




