Makthal: మక్తల్‌లో కన్నుల పండుగగా వాసవి మాత అమ్మవారి శోభాయాత్ర
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి బస్టాండ్ చౌక్, ఆజాద్ నగర్ మీదుగా అమ్మవారి శోభాయాత్ర ఘనంగా సాగింది.
Makthal: మక్తల్‌లో కన్నుల పండుగగా వాసవి మాత అమ్మవారి శోభాయాత్ర
మక్తల్: మక్తల్ పట్టణంలో గల శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో తొమ్మిది రోజులపాటు నిత్య పూజలు అందుకుని, బుధవారం నాడు అమ్మవారి శోభాయాత్ర పట్టణ పురవీధుల గుండా అంగ రంగవైభవంగా కొనసాగింది. అందులో భాగంగా పురుషులు భక్తి పాటలతో భజన,అడుగుల భజన అలాగే చిన్నారులు, మహిళలు దాండియా, బతుకమ్మ నృత్యాలు చేసుకుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి బస్టాండ్ చౌక్,ఆజాద్ నగర్ మీదిగా అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండుగ గా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, భక్తులు,పట్టణ ప్రజలు,చిన్నారులు పురుషులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.




