Nagarkurnool: వెల్దండలో దసరా, బతుకమ్మ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు..సర్పంచ్!

Nagarkurnool: వెల్దండలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అధ్యక్షతన దసరా, ఎదురుకోళ్లు, సద్దుల బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Oct 2026 1:59 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వెల్దండలో దసరా, బతుకమ్మ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు..సర్పంచ్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేద పండితుల సలహాలు, సూచనల మేరకు పండుగ తేదీలను ఖరారు చేశారు. మంగళవారం 20వ తేదీన దసరా, బుధవారం నాడు ఎదురుకోళ్లు, గురువారం నాడు సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ మూడు రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటపాటలు నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి గిరి, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY