Nagarkurnool: నాగర్‌కర్నూల్ వాసవి ఆలయంలో ఘనంగా సామూహిక షష్ఠిపూర్తి వేడుకలు!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం జరిగింది.
Nagarkurnool: నాగర్‌కర్నూల్ వాసవి ఆలయంలో ఘనంగా సామూహిక షష్ఠిపూర్తి వేడుకలు!
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై షష్ఠిపూర్తి వేడుకలు నిర్వహించుకుంటున్న దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దంపతుల జీవితాలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
మహోత్సవంలో భాగంగా షష్ఠిపూర్తి చేసుకుంటున్న దంపతులకు అసోసియేషన్ సభ్యులు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం హోమం, శివపార్వతుల కల్యాణం, దంపతులకు పాదపూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు, ఆర్యవైశ్యులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
కార్తీక బహుళ పంచమి, పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 8 గంటల నుంచి నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక జరిగింది.




