Hanwada: తిరుమలగిరిలో వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం: మారేపల్లి సురేందర్

Hanwada: హన్వాడ మండలం తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఆదివారం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 29 Nov 2026 2:12 PM IST
Hanwada
X

Hanwada: తిరుమలగిరిలో వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం: మారేపల్లి సురేందర్

మహబూబ్ నగర్: ​హన్వాడ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులు మహేష్ - సుజాత దంపతులు ఆదివారం వైభవంగా గృహప్రవేశ మహోత్సవాన్నికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మరియు మహబూబ్ నగర్ జిల్లా ఓలంపిక్స్ అధ్యక్షులు NP వెంకటేష్ లు కలిసి ప్రత్యేకాభినందనలు తెలిపారు.

​ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్ది మరియు NP వెంకటేష్ లు , నూతన గృహంలో అడుగుపెట్టిన దంపతులకు శుభాకాంక్షలు అందించారు. అనంతరం ఆయన సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...

​"పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ప్రతీ అర్హునికి ఇందిరమ్మ ఇల్లు అందేలా వార్డు స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. నూతన గృహంలో మహేష్-సుజాత దంపతుల కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను."

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు V మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు, బంధుమిత్రులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.