Hajilapuram: దేవరకద్ర మండలం హజిలాపురంలో వైభవంగా ఆంజనేయస్వామి పల్లకి సేవ!
Hajilapuram: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజిలాపురంలో ఘనంగా ముగిసిన 41 రోజుల శ్రావణమాస పూజలు. వీధివీధినా వైభవంగా ఆంజనేయస్వామి పల్లకి సేవ.
Hajilapuram: దేవరకద్ర మండలం హజిలాపురంలో వైభవంగా ఆంజనేయస్వామి పల్లకి సేవ!
Hajilapuram: శ్రావణమాసం పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజిలాపురం గ్రామంలో 41 రోజులపాటు శ్రావణమాస పూజలు నిర్వహిస్తారు. ఈ 41 రోజులపాటు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద గ్రామ పెద్దలు, యువకులు భజన పరులు అందరూ కలిసి ప్రతిరోజు స్వామిని కీర్తిస్తూ భజనలు నిర్వహిస్తారు. నేటికీ 41వ రోజు పూర్తి కావడంతో గ్రామంలో వీధి వీధినా ఆంజనేయస్వామి పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు.ఈ పల్లకి సేవకు గ్రామ మహిళలందరూ బిందెలతో నీళ్లు తీసుకువచ్చి స్వామివారిపల్లకి సేవ ముందు నీటిని పోసి స్వామిని మొక్కి మొక్కులు తీర్చుకున్నారు.
గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంచి వానలు పడి పాడి, పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు,పశుపక్షాదులు క్షేమంగా ఉండాలని, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పూజలు నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి తెలిపారు. పల్లకి సేవ అనంతరం అన్న ప్రసాద వితరణ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు నారాయణ గౌడ్, రాజేంద్రకుమార్ ,శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, ఆశప్ప, పరందామారెడ్డి, పెంటయ్య గౌడ్, బాలరాజు గౌడ్, రాఘవరెడ్డి, ఎం వెంకటమ్మ, రఘురామారెడ్డి, నాగిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, డి ఆంజనేయులు , గ్రామ మహిళలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




