Veldanda: వెల్దండలో ఘనంగా చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకలు!
Veldanda: వెల్దండ మండల కేంద్రానికి చెందిన క్యాసరపు తిరుపతి కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.
Veldanda: వెల్దండలో ఘనంగా చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకలు!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన క్యాసరపు తిరుపతి కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఆకృతి గార్డెన్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతిరెడ్డిలు చిన్నారిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, కాంట్రాక్టర్ శిశుపాల్ రెడ్డి, జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, నాయకులు కృష్ణారెడ్డి, రషీద్, మడలమోని కృష్ణ, రంగయ్య, కిష్టల్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీను, భరత్ గౌడ్ తదితరులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.




